Sun Mar 15 2026 13:24:06 GMT+0530 (India Standard Time)
ఏలూరు జిల్లాలో మహా పాదయాత్ర
ఈరోజు కొనికి నుంచి ప్రారంభమయ్యే రైతుల మహా పాదయాత్ర కొత్తూరు వరకూ కొనసాగనుంది.

అమరావతి రైతుల మహా పాదయాత్ర నేడు 15వ రోజుకు చేరుకుంది. ఈరోజు కొనికి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కొత్తూరు వరకూ కొనసాగనుంది. పెదపాడు వద్ద భోజన విరామ సమయం ఇస్తారు. ఈరోజు మొత్తం 15 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని రైతులు నిర్ణయించారు.
భారీ బందోబస్తు మధ్య..
ఏలూరు జిల్లాలో మహా పాదయాత్ర
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతుల మహాపాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతుంది. పోలీసులు ఈ యాత్రకు భారీ బందోబస్తును కల్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.
Next Story

