Sun Dec 14 2025 01:50:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విచారణకు శైలజా కిరణ్
మార్గదర్శి చిట్ఫండ్ కేసులో నేడు సీఐడీ అధికారులు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ను విచారించనున్నారు

మార్గదర్శి చిట్ఫండ్ కేసులో నేడు సీఐడీ అధికారులు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ను విచారించనున్నారు. ఈ మేరకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని శైలజా కిరణ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో శైలజా కిరణ్ ఏ2 నిందితురాలిగా ఉన్నారు.
రామోజీకీ నోటీసులు...
ఏ1 రామోజీకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. నిన్న హైదరాబాద్ మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సీఐడీ సోదాలు చేసింది. బ్యాలెన్స్ షీట్లు సహా డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. ఈరోజు శైలజా కిరణ్ ను సోదాల సందర్భంగా వెల్లడయిన వివరాలపై శైలజా కిరణ్ను ప్రశ్నించే అవకాశాలున్నాయి.
- Tags
- sailaja kiran
- cid
Next Story

