Thu Dec 18 2025 13:41:14 GMT+0000 (Coordinated Universal Time)
నేడు "జగనన్నకు చెబుదాం" ప్రారంభం
ఈరోజు ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం కానుంది

ఈరోజు ముఖ్యమంత్రి జగన్ తన క్యాంప్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం కానుంది. టోల్ ఫ్రీ నెంబరు 1902 ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. సంతృప్త స్ధాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా కొత్త కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్ కోసమే ఈ విన్నూత్న కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
సమస్యల పరిష్కారానికి...
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో ఎదురయ్యే ప్రజల సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న కారణంతో ఈ కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం చేపట్టింది. సంక్షేమ పథకాలు అందకపోయినా, వైఎస్సార్ పెన్షన్ కానుక ఇవ్వకపోయినా, ఇవ్వడంలో ఏమైనా సమస్యలు ఉన్నా, రేషన్ కార్డు వంటివి పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా జగన్ కు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు. 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేస్తే వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేయనున్నారు.
Next Story

