Thu Mar 19 2026 02:59:17 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు గుంటూరుజిల్లాలో ప్రజాగళం
ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజాగళం పర్యటన ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరగనుంది

ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజాగళం పర్యటన ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరగనుంది. రోజుకు రెండు నియోజకవర్గాలను పర్యటిస్తున్న చంద్రబాబు కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ ఆయన ప్రజాగళం పర్యటన సాగుతుంది.
గుంటూరు జిల్లాలో...
ఈరోజు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలోని వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తూనే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానిపై చంద్రబాబు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
Next Story

