Tue Feb 24 2026 12:36:07 GMT+0530 (India Standard Time)
నేడు ఛలో విజయవాడ
నేడు ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికుల పిలుపు ఇచ్చారు

నేడు ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికుల పిలుపు ఇచ్చారు. మున్సిపల్ కార్మికుల చలో విజయవాడతో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. అయితే తమ న్యాయమైన కోర్కెలను నెరవేర్చాలంటూ మున్సిపల్ కార్మికులు చలో విజయవాడకు పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
డిమాండ్లు ఇవే...
మున్సిపల్ కార్మికులు తమకు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీంతో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధమవుతుంది. మున్సిపల్ కార్మికుల సమ్మెతో పారిశుధ్యం సమస్య ఏర్పడి అనారోగ్యం ప్రబలుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Next Story

