Thu Dec 05 2024 16:51:16 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు తిరుపతిలో భారీ బహిరంగ సభ
నేడు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు
నేడు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో వైసీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య నేతలందరూ హాజరవుతున్నారు. తిరుపతి శివారులో బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లాకు భూమన కరుణాకరెడ్డిని పార్టీ అధినాయకత్వం అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే.
భూమన ప్రమాణ స్వీకారానికి...
ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ సభలోనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజాతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి తిరుపతి జిల్లా నుంచి నలుమూలల నుంచి వైసీపీీ కార్యకర్తలు హాజరు కానున్నారు.
Next Story