Thu Mar 19 2026 04:37:19 GMT+0530 (India Standard Time)
నేడు జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల
నేడు జగనన్న విద్యాదీవెన పథకం కింద లబ్దిదారులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిధులు విడుదల చేయనున్నారు

నేడు జగనన్న విద్యాదీవెన పథకం కింద లబ్దిదారులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిధులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్యాదీవెన మూడో విడత పథకం నిధులు విడుదల చేయడం కొంత ఆలస్యమయింది. ఈరోజు మూడో విడత మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని జగన్ నిర్ణయించారు. సచివాలయం నుంచి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జగన్ ఈ నగదును జమ చేయనున్నారు.
10. 87 లక్షల మంది....
జగనన్న విద్యాదీవెన పథకం మూడో విడత నిధులు 709 కోట్ల రూపాయలను నేడు ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద దాదాపు 10.82 లక్షల మంది విద్యార్థులు లబ్ది పొందనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ , మెడిసిన్ చదివే విద్యార్థులకు ఫీజులు మొత్తం ఈ పథకం కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది.
Next Story

