Tue Jan 20 2026 16:14:34 GMT+0000 (Coordinated Universal Time)
Anna Canteen : నేడు 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం
నేడు ఆంధ్రప్రదేశ్ లో మరో 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి.

నేడు ఆంధ్రప్రదేశ్ లో మరో 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో అన్నా క్యాంటిన్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం 203 అన్నా క్యాంటిన్లను ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వంద అన్నా క్యాంటిన్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
ఐదు రూపాయలకే...
ఐదు రూపాయలకే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని అందిస్తుంది. నేటితో ఏపీలో అన్నా క్యాంటిన్ల సంఖ్య 175 కానున్నాయి. ముఖ్యమైన అన్ని ప్రాంతాల్లో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేందుకు ఈ అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తుంది. దశల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story

