Thu Mar 19 2026 09:50:30 GMT+0530 (India Standard Time)
నేడు గుంటూరు జిల్లాకు జగన్
నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు

నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. ప్రభుత్వం పెంచిన వైఎస్సార్ పెన్షన్ కానుకను లబ్దిదారులకు నేరుగా అందించనున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేవారు. జగన్ తన పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది పెన్షన్ ను 250 రూపాయలకు పెంచుతానని మాట ఇచ్చారు. తాను పెన్షన్ మొత్తాన్ని మూడు వేలకు చేస్తానని చెప్పారు.
బహిరంగ సభలో....
ఆ క్రమంలోనే ఈ ఏడాది 250 రూపాయలు పెంచి పెన్షన్ మొత్తాన్ని 2,500లకు ప్రభుత్వం చేసింది. దీనిపై ప్రత్తిపాడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జగన్ ప్రసంగించనున్నారు. లబ్దిదారులకు నేరుగా పింఛన్లను అంద చేయనున్నారు. సీఎం రాక సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

