Sun Dec 14 2025 19:34:39 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో భద్రత మరింత పెంపు
తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు

శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఉన్న హోటల్స్ కు కొందరు ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడుతూ తిరుమల వచ్చే భక్తులను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచనలో ఉన్నారని ఆయన అన్నారు.
బాంబు బెదిరింపులపై...
బాంబు బెదిరింపులపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని ఎస్సీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతిలో భద్రతను మరింతగా పెంచామన్న ఆయన బెదిరింపు మెయిల్స్, కాల్స్ పంపిన వారి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు. ఆకతాయిలా పనా? లేక కొందరు కావాలనే చేస్తున్నారా? అన్నది విచారణలో తెలియాల్సి ఉందన్నారు. బాంబు బెదిరింపులపై కేంద్ర నిఘా సంస్థ సహకారంతో దర్యాప్తు జరుగుతుందని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.
Next Story

