Fri Dec 05 2025 15:50:00 GMT+0000 (Coordinated Universal Time)
29న తిరుపతిలో ఆత్మగౌరవ సభ
వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి అన్నారు.

వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి అన్నారు. ఈ నెల 29న తిరుపతిలో ఆత్మగౌరవ మహా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రాజధానుల కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుకు అందరూ సహకరించాల్సిందేనని ఆయన కోరారు. సీమకు ఈసారి అయినా న్యాయం జరగాలని ఆయన కోరారు.
జగన్ నిర్ణయాన్ని...
ముఖ్యమంత్రి జగన్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని, దానికి అందరూ ఆమోదించాల్సిన అవసరం ఉందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడి ఉన్నాయని, వాటి అభివృద్ధికి జగన్ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రైతుల పాదయాత్ర ఇతర ప్రాంత వాసుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీరనిద్రోహం చేస్తున్నారని, ఐదు లక్షల కోట్లు ఒక్క రాజధానిలోనే ఖర్చు పెట్టాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని భూమన పిలుపు నిచ్చారు.
Next Story

