Sun Mar 15 2026 12:31:38 GMT+0530 (India Standard Time)
తాను ఎన్నటికీ జగన్ కు వీర విధేయుడినే
తాను ఎప్పటికీ జగన్ కు విధేయుడినేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు

తాను ఎప్పటికీ జగన్ కు విధేయుడినేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మహాత్ముడు తన జీవితంలో చెప్పిన మాటలను చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ పాల్గొన్న సమావేశంలో చేసిన తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని అన్నారు. తాను జగన్ మీద మాట్లాడినట్లు కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. తాను నిబద్ధతగల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిని అన్నారు. వైఎస్ కుటుంబంతో తన అనుబంధం 48 సంవత్సరాలని అన్నారు.
మహాత్ముడు అన్న మాటలు...
తాను తీవ్రవాద రాజకీయాల నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లనే ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వైఎస్ కుటుంబానికి రాజకీయ సేవ చేసుకోవడానికే వచ్చానని అన్నారు. మహాత్ముడు 90 సంవత్సరాల క్రితం నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమైనవని, పతనమైన మానవుడు అధికారంలోకి వస్తే ఒరగబెట్టేదేమీ లేదని అన్న మాటలను తాను ఉటంకించానని తెలిపారు. అంతే తప్ప తాను ఎవరినీ ఉద్దేశించి అన్నవి కావని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
Next Story

