Fri Dec 05 2025 14:15:59 GMT+0000 (Coordinated Universal Time)
SVU క్యాంపస్‌లో చిరుత పట్టుబట్టి సంచలనం
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాలలో గత నెల రోజులుగా సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు దొరికింది.

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాలలో గత నెల రోజులుగా సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు దొరికింది. వర్సిటీ క్యాంపస్‌లోని కుక్కలు, జింకలపై దాడి చేసి చంపుతుండటంతో యూనివర్సిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నెల రోజుల క్రితమే వర్సిటీలోని పలు చోట్ల అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు క్యాంపస్‌లోని ఏడీ బిల్డింగ్ వెనుక ఫారెస్టు అధికారులు ఉంచిన బోనులో చిరుత చిక్కింది. దానిని అధికారులు ఎస్వీ జూపార్క్‌కు తరలించారు.
News Summary - Leopard roaming near SV University Tirupati for a month finally caught by forest officials; shifted to SV Zoo Park after multiple animal attacks.
Next Story

