Wed Mar 25 2026 04:12:49 GMT+0530 (India Standard Time)
నేడు సర్వదర్శనం టిక్కెట్లు జారీ
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.

ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేస్తుంది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా సర్వదర్శనం టోకెన్లను చాలా కాలం టీటీడీ నిలిపి వేసింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడానికి సిద్ధమయింది.
రోజుకు పదిహేను వేలు...
సర్వ దర్శనం టిక్కెట్లను ఈరోజు నుంచి తిరిగి ప్రారంభిస్తారు. రేపు దర్శనం కోసం ఈరోజు టిక్కెట్లను జారీ చేయనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజ స్వామి కాంప్లెక్స్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సర్వదర్శనం టోకెన్లను పొందవచ్చు. రోజుకు పది హేను వేల చొప్పున టిక్కెట్లను కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది.
Next Story

