Thu Mar 19 2026 21:48:28 GMT+0530 (India Standard Time)
నేడు టీటీడీ సేవా టిక్కెట్ల విడుదల
ఈరోజు వర్చువల్ సేవల కోటా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.

ఈరోజు వర్చువల్ సేవల కోటా టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. వర్చువల్ సేవల, దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు, జూన్ నెల కోటాను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు వర్చువల్ సేవలను వినియోగించుకోవాలనుకునే వారు ఈ అవకాశాాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది.
రేపు ప్రత్యేక దర్శనం...
రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనుంది. మే, జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమలలో మే నెల గదుల కోటాను ఎల్లుండి ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ద్వారా బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
Next Story

