Mon Mar 17 2025 02:02:01 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్
తిరుమల వెళ్లే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.

తిరుమల వెళ్లే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్లుండి మూడు వందల రూపాయల శీఘ్రదర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. ఈ నెల 25వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మే, జూన్ నెలలో తిరుమల రావాలనుకున్న భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అదే సమయంలో వసతి గదులను కూడా బుక్ చేసుకునే వీలు కల్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో పేర్కొంది.
వసతి కోసం కూడా...
ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లేదా tt devasthanams యాప్లో మీ వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. మే, జూన్ నెలలకు సంబంధించి తిరుమలలో వసతి గృహాల కోసం ఏప్రిల్ 26న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఇవి కూడా తిరుపతి అధికారిక వెబ్సైట్, యాప్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరింది.
Next Story