Thu Jan 29 2026 01:48:38 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. నేడే టిక్కెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనునంది. వీటితో పాటు దర్శన టిక్కెట్ల కోటాను కూడా విడుదలచేస్తారు. సెప్టెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. సెప్టెంబరు నెలలో తిరుమలకు వచ్చే వారు ముందుగా ఈ టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకుని దర్శనం పొందవచ్చని తెలిపారు.
ఆర్జిత సేవా టిక్కెట్లను...
ఆర్జిత సేవా టిక్కెట్లను ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం పది గంటల వరకూ నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టిక్కెట్లు పొందిన భక్తులు ఈ నెల 22న మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నిర్దేశిత రుసుం చెల్లంచి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ నెల 21 వ తేదీన ఉదయం పది గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
Next Story

