Wed Jan 28 2026 22:14:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టీటీడీ పాలక మండలి సమావేశం
నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరగనుంది

నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోనున్నారు. 49 అంశాల అజెండాతో టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. శ్రీవెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ పేరిట మరో నూతన పథకాన్ని ప్రారంభించేందుకు టీడీడీ పాలకమండలి ఆమోదం తెలపనుంది. లక్ష రూపాయలు ఇచ్చిన దాతలకు ఒకసారి స్వామి వారి వీఐపీ దర్శనాన్ని కల్పించనుంది. ఆపన్న హృదయ స్కీమ్ కింద వచ్చిన విరాళాలను చిన్న పిల్లల వైద్య చికిత్స కోసం వినియోగించనున్నారు.
48 అంశాలతో...
అలాగే అన్నదానం కాంప్లెక్స్ లో సోలార్ స్టీమ్ కుకింగ్ విధానం, తిరుపతిలో చైల్డ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధుల విడుదల, తిరుపతిలో శ్రీనివాస సేతు పనులకు సంబంధించి నిధులను విడుదల చేయడంపై టీడీపీ పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారు. చిన్న పిల్లల ఆసుపత్రికి 230 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది.
Next Story

