Thu Jan 29 2026 18:21:17 GMT+0000 (Coordinated Universal Time)
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. సేవా టిక్కెట్లతో షాక్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి సేవలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి సేవలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖల ద్వారా కల్పించే సేవలను పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సుప్రభాత సేవ రెండు వేలు, తోమాల, అర్చన సేవ ఐదువేలు, కల్యాణోత్సవం 2,500లుగా నిర్ణయించారు. వేదపండితులచేత ఆశీర్వచనం పదివేల రూపాయలుగా నిర్ణయించారు.
అన్నమయ్య నడక మార్గాన్ని....
ఇక వస్త్రాలంకరణ సేవా టక్కెట్ ను లక్ష రూపాయలకు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఆనంద నిలయానికి బంగారు తాపడం వేయాలని నిశ్చయించింది. అలిపిరి వద్ద ఆధ్యాత్మిక సిటీ పేరుతో నాలుగు ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించింది. అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ పాలకమండలి డిసైడ్ చేసింది.
- Tags
- ttd
- seva tickets
Next Story

