Fri Dec 05 2025 15:41:01 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆయన తనిఖీలు చేశారు. నిన్న జరిగి పాలకమండలి భేటీలో తిరుమలలో ప్రయివేటు హోటళ్లను తొలగించాలని తీసుకున్న నిర్ణయంతో వైవీ సుబ్బారెడ్డి తనిఖీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను...
తిరుమలలో వందల సంఖ్యలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లున్నాయి. భక్తులందరూ వీటిపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే వీటిని ఎలా తొలగించాలన్న దానిపై కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని పాత అన్నదాన భవనం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆయన తనిఖీలు నిర్వహించారు. అన్నప్రసాదాన్ని విరివిగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్బంగా వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story

