Mon Mar 16 2026 06:18:53 GMT+0530 (India Standard Time)
తిరుమల ఘాట్ రోడ్డు మూసివేత
తిరుమల ఘాట్ రోడ్డును మూసివేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాలు జారీ చేసింది.

తిరుమల ఘాట్ రోడ్డును మూసివేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాలు జారీ చేసింది. తిరుమల కొండపై మంచు కమ్మేసింది. దీంతో అసలు రోడ్డు మార్గం కూడా కనపడకుండా పోయింది. దీంతో తిరుమలకు వెళ్లే, వచ్చే రెండు ఘాట్ రోడ్టులను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
సురక్షితం కాదని....
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఘాట్ రోడ్డు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. విరిగిపడిన కొండరాళ్లను సిబ్బంది తొలగించాల్సి ఉంది. దీంతో తిరుమల ఘాట్ రోడ్డును మూసివేయాలని, భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.
Next Story

