Sat Mar 07 2026 20:42:09 GMT+0530 (India Standard Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 9న బుధవారం ఆడికృత్తిక

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.శనివారం శ్రీవారిని 81,472 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 38,820 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 9న బుధవారం ఆడికృత్తిక పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం అభిషేకం చేపడతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవర్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
Next Story

