Thu Mar 19 2026 07:19:31 GMT+0530 (India Standard Time)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 72,650 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లుగా ఉంది. 27,410 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు గరుడసేవ ప్రారంభమైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
Next Story

