Mon Mar 16 2026 04:33:08 GMT+0530 (India Standard Time)
నేడు సర్వదర్శనం టిక్కెట్ల విడుదల
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది.

ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టిక్కెట్లను విడుదల చేయనుంది. నిన్న ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేసింది. కేవలం నలభై ఐదు నిమిషాల్లో టిక్కెట్లన్నీ అమ్ముడు పోయాయి. నేడు సర్వదర్శనం టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
పదివేల టోకెన్లు....
ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టిక్కెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకూ పదివేల సర్వదర్శనం టిక్కెట్లను నేడు తిరుమల తిరుపతి దేవస్థానం విడుల చేయనుంది.
- Tags
- ttd
- sarvadarsanam
Next Story

