Sat Mar 07 2026 12:59:14 GMT+0530 (India Standard Time)
Tirumala : రేపు శ్రీవారి ఆలయం మూసివేత
శనివారం పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రేపు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు

శనివారం పాక్షిక చంద్రగ్రహణం కారణంగా రేపు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం వరకే క్యూ లైన్లలోకి భక్తులకు అనుమతిస్తారు. రేపు రాత్రి 7.05 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు.
ఎనిమిది గంటలు...
ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత తిరిగి 29వ తేదీ ఉదయం ఆలయాన్ని తెరవనున్నారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తులు ఇది గమనించి తిరుమల టూర్ కు ప్లాన్ చేసుకోవాలని వారు కోరుతున్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలను నిలిపి వేయనున్నారు.
Next Story

