Sun Mar 15 2026 19:07:56 GMT+0530 (India Standard Time)
తిరుమల ఆలయం మూసివేత
ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు

ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 74,094 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,475 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.52 కోట్ల రూపాయలుగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

