Sat Mar 21 2026 03:02:18 GMT+0530 (India Standard Time)
నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అక్టోబరు నెల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 22న వర్చువల్ సేవల కోటా విడుదల చేయనున్నారు.
వివిధ సేవల ద్వారా...
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.జూలై 23న అంగప్రదక్షిణం టోకెన్లు, అక్టోబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. జూలై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది.
Next Story

