Tue Mar 17 2026 04:15:51 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు సెలవు దినం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు సెలవు దినం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి దర్శన సమయం ఐదు గంటలు పడుతుంది. ఎస్ఎస్డీ టోకెన్లు లేని వారికి సర్వదర్శనం క్యూలైన్ లో ప్రవేశించే వారికి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి దర్శనం ఐదు గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,493 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరలో 24,958 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.82 కోట్ల రూపాయలు వచ్చిందని అధకారులు వెల్లడించారు.
Next Story

