Fri Aug 12 2022 05:40:43 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తిరుమలలో రద్దీ ఎక్కువగానే

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శని వారం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రేపు కూడా రద్దీ కొనసాగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 65,939 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,894 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story