Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ మామూలుగా లేదు.. బ్రహ్మోత్సవాలు కావడంతో?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది
![crowd, devotees, brahmotsavam, tirumala darshan timings today, tirumala is crowded with devotees today, brahmotsavam in tirumala2024 crowd, devotees, brahmotsavam, tirumala darshan timings today, tirumala is crowded with devotees today, brahmotsavam in tirumala2024](https://www.telugupost.com/h-upload/2024/10/05/1658042-tirumala.webp)
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వీధులన్నీ గోవింద నామ స్మరణతో మారు మోగిపోతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నిన్న ధ్వజారోహణంతో ప్రారంభమయిన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు సాగనున్నాయి. స్వామి వారిని మాడ వీధుల్లో తిలకించేందుకు ఎక్కువ మంది భక్తులు వేచి ఉన్నారు. వసతి గృహాలు కూడా దొరకడం లేదు. అయినా భక్తులు బయట షెల్టర్లలోనే ఉంటున్నారు. పిల్లా పాపలతో వారు అక్కడే ఉండి కాలకృత్యాలను కూడా సమీపంలోని సామూహిక మరుగుదొడ్లలో తీర్చుకుని, అక్కడే ఉన్న కోనేటిలో స్నానం చేసి, తలనీలాలను సమర్పించుకుని దర్శనానికి వెళుతున్నారు.