Sat Jan 31 2026 00:08:52 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కార్తీక మాసం రెండో శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగిందని భావిస్తున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కార్తీక మాసం రెండో శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగిందని భావిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని తిరుపతి తిరుమల అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు క్యూ లైన్ లో వచ్చిన వారికి అదనంగా మరో నాలుగు గంటల సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,670 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,475 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.79 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

