Sat Mar 07 2026 16:15:03 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే..?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో వెంకన్న దర్శనానికి పోటెత్తారు.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో వెంకన్న దర్శనానికి పోటెత్తారు. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం నాడు శ్రీవారిని 73,572 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,448 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో విశేష ఉత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. జూలై 1న శని త్రయోదశి, 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురుపూర్ణిమ, 13న సర్వఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేయడం, 30న నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం ఉంటాయని తెలిపింది.
Next Story

