Sat Mar 07 2026 20:42:02 GMT+0530 (India Standard Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఆగస్టు 15 నాడు కొనసాగింది

తిరుమలలో భక్తుల రద్దీ ఆగస్టు 15 నాడు కొనసాగింది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 78,726 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 26,436 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఆగస్టు 17న టెండర్ కమ్ వేలం వేయనున్నారు. ఇందులో హెచ్ఎంటి, సీకో, సిటిజన్, టైమ్స్, సోని, టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయ వేళల్లో సంప్రదించండి.
Next Story

