Thu Mar 19 2026 07:41:45 GMT+0530 (India Standard Time)
తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా.. ఈ వివరాలు తెలుసుకోండి
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాడు చాలా తక్కువగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాడు చాలా తక్కువగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 1 కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం 79,444 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,744 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం నవంబరు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా నవంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
Next Story

