Sat Mar 28 2026 05:57:10 GMT+0530 (India Standard Time)
పాకలో దూరిన పులి... ఎట్టకేలకు బంధించిన అధికారులు
తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది.

కూర్మాపురంలో దూడను చంపి పాకలో పులి చొరబడింది. అయితే దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, వెటర్నరీ వైద్యులు ప్రయత్నిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. రాయవరం మండలం కూర్మాపురంలో పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ, పోలీస్ యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
దూడను చంపి...
గ్రామానికి చెందిన పొలగాని సత్తిబాబు పశువుల పాకలో ఒక దూడను చంపిన పులి, ప్రస్తుతం అక్కడే నక్కి ఉంది. అధికారులు పాక చుట్టూ పటిష్టమైన వలలు ఏర్పాటు చేసి దిగ్బంధించారు. పులి ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశం ఉన్నందున, వెటర్నరీ బృందాలు మత్తు ఇంజెక్షన్లతో సిద్ధంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్‌తో స్థానిక ప్రజలు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. చివరకు పూణే నుంచివచ్చిన ప్రత్యేక బృందం పులిని బంధించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story

