Fri Apr 10 2026 21:38:54 GMT+0530 (India Standard Time)
Tiger : కాకినాడ జిల్లాలో పులి టెన్షన్
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మన్యం ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మన్యం ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది. శంఖవరం మండలం అచ్చంపేట, కొత్తూరు, ఎస్.జగ్గంపేట పరిసరాల్లో పులి కదలికలు కనిపించాయి. మూడుచోట్ల పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
రాకపోకలు నిలిపివేతకు...
కొన్ని గ్రామాల రహదారులపై రాకపోకల నిలిపివేతకు అధికారుల సమాలోచనలు చేస్తున్నారు. బోన్లు, ఇతర పరికరాలు అమర్చి ఆపరేషన్ అటవీ బృందాలు కొనసాగిస్తున్నాయి. పులి సంచారంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతుల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పులిని పట్టుకునేంత వరకూ స్థానికులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Next Story

