Sat Mar 07 2026 20:08:23 GMT+0530 (India Standard Time)
టీడీపీ లో టిక్కెట్ల రగడ... ముఖ్య అనుచరులతో సమావేశం
పెదకూరపాడు తెలుగుదేశం పార్టీలో కూడా టిక్కెట్ వార్ మొదలయింది.

పొత్తుల వేళ టీడీపీలో టిక్కెట్ల రగడ మొదలయింది. ఎవరి టిక్కెట్ పోతుందో? ఎవరి టిక్కెట్ ఊడుతుందో తెలియని పరిస్థితి. పొత్తుల్లోనే కాదు.. ఈసారి టీడీపీకి పట్టున్న సీట్లలో కూడా అభ్యర్థులను కొత్త వారిని పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిసి నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో అనేక మంది నేతలు తమకు చివరి నిమిషంలో చంద్రబాబు హ్యాండ్ ఇస్తారేమోనని భయం అందరి నేతల్లోనూ ఉంది.
పెదకూరపాడులో...
తాజాగా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీలో కూడా టిక్కెట్ వార్ మొదలయింది. పెదకూరపాడు టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆశిస్తున్నారు. అయితే ఆయనకు కాదని పెదకూరపాడు టిక్కెట్ ను భాష్య ప్రవీణ్ కు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులతో సమావేశం అవుతున్నారు. భవిష్యత్ కార్యాచారణ ప్రకటించే అవకాశముంది.
Next Story

