Thu Mar 19 2026 13:02:02 GMT+0530 (India Standard Time)
సీఎం సభలో సొమ్మసిల్లి పడిపోయిన మహిళలు
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ముఖ్యమంత్రి సభకు వచ్చిన ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ముఖ్యమంత్రి సభకు వచ్చిన ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే సిబ్బంది వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంచినీరు అందుబాటులో లేక, ఎండకు వారు సొమ్మసిల్లి పడిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అత్యవసర చికిత్స....
కొద్దిసేపటి క్రితం అవనిగడ్డలో ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభకు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి మహిళలు హాజరయ్యారు. వీరిలో ముగ్గురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

