Mon Dec 09 2024 10:20:42 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సీఎంను కలవనున్న ముగ్గురు సీమ నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు రాయలసీమకు చెందిన ముగ్గురు నేతలు కలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నేడు రాయలసీమకు చెందిన ముగ్గురు నేతలు కలవనున్నారు. వారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. కడప జిల్లాల్లో ఆర్టీపీపీ ఫ్లై యాష్ తరలింపు కాంట్రాక్టుపై జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డిల మధ్య పోరు జరుగుతున్న నేపథ్యంలో ముగ్గురికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చంద్రబాబు వారిని ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకుంటున్నారు.
కొద్దిరోజులుగా వివాదం...
గత కొద్ది రోజులుగా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి వాటా కోసం ఇరువురు నేతలు బాహాబాహీకి దిగుతుండటం పార్టీకి నష్టం కలిగిస్తుందని భావించిన చంద్రబాబు వారితో నేరుగా మాట్లాడి ఒప్పించేందుకు నేడు సిద్ధమవుతున్నారు. ఈ పంచాయతీలో వీరి సమస్య ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికీ కడప ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story