Sat Dec 06 2025 03:01:49 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో ముగ్గురు పదో తరగతి విద్యార్థినులు మిస్సింగ్
ముగ్గురు విద్యార్థినులు మిస్సైనట్లు సిబ్బంది గుర్తించారు. విద్యార్థినులు మిస్సైన వెంటనే ఉపాధ్యాయులు స్థానిక పోలీస్..

నెల్లూరు జిల్లాలో విద్యార్థినులు అదృశ్యమయ్యారు. రావూరులో ముగ్గురు పదో తరగతి విద్యార్థినుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఎస్సీ, ఎస్టీ గురుకులం నుండి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. కనిపించకుండా పోయిన ముగ్గురిని జ్యోతి, నాగమణి, అంకితగా గుర్తించారు. వీరు రాపూరు, కల్వాయి, పొదలుకూరుకు చెందిన వారుగా గుర్తించారు.
ప్రతిరోజూ ఉదయం, రాత్రి గురుకులంలో హాజరు తీసుకుంటారు. అలాగే గతరాత్రి కూడా హాజరు తీసుకుంటుండగా.. ముగ్గురు విద్యార్థినులు మిస్సైనట్లు సిబ్బంది గుర్తించారు. విద్యార్థినులు మిస్సైన వెంటనే ఉపాధ్యాయులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థినుల ఆచూకీకోసం గాలిస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకూ సమాచారమిచ్చారు. విద్యార్థినుల స్నేహితులను విచారించగా.. తమకేమీ తెలియదన్నారు. కాగా.. రావూరు ఎస్సీ, ఎస్టీ గురుకులంలో సుమారు 200 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అక్కడ 6 నుండి 10వ తరగతి వరకూ తరగతులు నిర్వహిస్తున్నారు.
Next Story

