Sun May 19 2024 22:32:04 GMT+0000 (Coordinated Universal Time)
బీచ్ ఒడ్డున జీప్ రైడింగ్ చేసిన బాలకృష్ణ
ఈసారి సంక్రాంతి వేడుకలను నందమూరి బాలకృష్ణ ప్రకాశం జిల్లాలో జరుపుకున్నారు
ఈసారి సంక్రాంతి వేడుకలను నందమూరి బాలకృష్ణ ప్రకాశం జిల్లాలో జరుపుకున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉండి ఫుల్లు ఎంజాయ్ చేశారు. బంధుమిత్రులతో కలసి బాలకృష్ణ కారంచేడులో హల్ చల్ చేశారు. బాలకృష్ణ సోదరి పురందేశ్వరి అత్తగారిల్లయిన కారంచేడుకు సంక్రాంతి పండగకు ముందే బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. భోగి పండగను అక్కడే జరుపుకున్నారు.
వేల సంఖ్యలో అభిమానులు...
అనంతరం సంక్రాంతి పండగ రోజు బాలకృష్ణ, మోక్షజ్ఞ లు గుర్రపు స్వారీ చేసి అలరించారు. ఈరోజు చీరాల ఓడరేవుకు వెళ్లారు. తన భార్య వసుంధరతోకలసి బీచ్ లో కాసేపు గడిపారు. జీప్ లో ఎక్కి బీచ్ లో రైడ్ చేసి బాలకృష్ణ అందరినీ అలరించారు. బాలకృష్ణ ఈసారి సంక్రాంతి పండగకు కారం చేడుకు వస్తున్నారని తెలిసి జిల్లాలో ఆయన అభిమానులు అధిక సంఖ్యలో చేరుకుని ఆయనతో ఫొటోలో దిగారు.
Next Story