Fri Dec 12 2025 08:43:45 GMT+0000 (Coordinated Universal Time)
Kolikapudi : మళ్లీ కెలికిన కొలికపూడి... వివాదాస్పద పోస్టులతో దుమారం
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి వచ్చారు.

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి వచ్చారు. పరోక్షంగా పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిపై వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేయడం మరోసారి కలకలం రేపుతుంది. పేకాట క్లబ్ లు నడుపుతున్నారంటూ.. రాయల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే చెరువుగట్టు వద్ద పేకాట క్లబ్ కు కింగ్ మారారంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఇటీవలే కొలికపూడి వివాదం పరిష్కారం అయిన పరిస్థితుల్లో మరొకసారి కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సోషల్ మీడియాలో పోస్టు చేయడం మరోసారి సంచలనంగా మారింది.
ఇటీవల పంచాయతీ...
ఇటీవల కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం రచ్చ కెక్కింది. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై సీరియస్ అయ్యారు. కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం తగ్గేటట్లు కనిపించడం లేదు. కేశినేని చిన్ని విషయంలో ఆయన తగ్గడం లేదనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదంటే పరిస్థితి చేయి దాటి పోయిందనే చెప్పాలి. కొలికపూడి శ్రీనివాసరావు తనపై పార్టీ ఎటువంటి చర్య తీసుకోదనే ధీమా కనిపించడమే ఇందుకు కారణమని ఖచ్చితంగా అనుకోవాల్సి ఉంటుంది.
వచ్చే ఎన్నికల వరకూ...
వచ్చే ఎన్నికల వరకూ తనను భరించడం తప్ప మరో మార్గం చంద్రబాబుకు లేదని కొలికపూడి శ్రీనివాసరావు భావిస్తున్నట్లే అనుకోవాలి. వచ్చే మూడేళ్ల పాటు తనపై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోరని గట్టి విశ్వాసంతో ఉన్నారు. అయితే కొలికపూడి శ్రీనివాసరావు మరొకసారి వివాదాస్పద పోస్టులు పెట్టడంపై ఇప్పుడు కొందరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చర్యలు తీసుకోకుంటే కొలికపూడి వేసే సర్జికల్ స్ట్రయిక్స్ ను నిత్యం భరించాల్సి వస్తుంది. కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం తనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా పరవాలేదన్న ధోరణిలో ఉన్నట్లుంది. ఇప్పుడు టీడీపీ నాయకత్వానికి ఇది తలనొప్పిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Next Story

