Fri Mar 27 2026 21:19:53 GMT+0530 (India Standard Time)
కుప్పం టీడీపీ నేతలకు బెయిల్
కుప్పంలో ఇటీవల అరెస్టయిన పదమూడు మంది టీడీపీ నేతలకి ముందస్తు బెయిల్ లభించింది

కుప్పంలో ఇటీవల అరెస్టయిన పదమూడు మందికి ముందస్తు బెయిల్ లభించింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సమయంలో పోలీసులపై తిరగబడ్డారంటూ పదమూడు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
పదమూడు మందికి...
దీనిని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా మొత్తం 13 మంది టీడీపీ నేతలకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ను ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. తిరిగి దీనిపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. హత్యాయత్నం కేసులు పెట్టడాన్ని హైకోర్టులో వారు సవాల్ చేశారు.
Next Story

