Mon Feb 02 2026 09:18:47 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నేడు వైసీపీ మూడో జాబితా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల మూడో జాబితా నేడు విడుదల కానుంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల మూడో జాబితా నేడు విడుదల కానుంది. ఇప్పటికే కొన్ని స్థానాలపై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి చర్చించారు. వారికి ఏ పరిస్థితుల్లో తాము టిక్కెట్ ఇవ్వలేకపోతుందీ తెలియజెప్పారు. మూడో జాబితాలోనూ మార్పులు, చేర్పులు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త వారిని ఇన్ఛార్జులుగా నియమించాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో మూడో జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్నది టెన్షన్ గా మారింది.
ఇప్పటికే రెండు దఫాలుగా...
ఇప్పటికే తొలి జాబితాలో పదకొండు నియోజకవర్గాల్లోనూ, రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులను నియమించిన నేపథ్యంలో మూడో జాబితాలో ఎంత మంది ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. నిన్నంతా నేతలతో జగన్ తో పాటు కొందరు కీలక నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఈరోజు మూడో జాబితాను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. మూడో జాబితాలో ఇరవై ఐదు నుంచి ముప్ఫయి నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Next Story

