Sun Dec 14 2025 02:36:48 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల క్యూ లైన్ లో కొట్టుకున్న భక్తులు
ఈరోజు తిరుమల క్యూ లైన్ లలో భక్తుల మధ్య గొడవలు జరిగాయి.

తిరుమలలో నేడు భక్తులు కిక్కిరిసి పోయి ఉన్నారు. దర్శనానికి పదిహేను గంటలకు పైగానే సమయం పడుతుంది. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంతో క్యూ లైన్ లలో ఉన్న భక్తులలో ఒకరకమైన ఫ్రస్టేషన్ కనిపిస్తుంది. చివరకు అది కొట్లాటలకు దారి తీసింది. ఈరోజు తిరుమల క్యూ లైన్ లలో భక్తుల మధ్య గొడవలు జరిగాయి.
మహాద్వారం వద్ద...
మహా ద్వారం వద్ద ఒకరి పై ఒకరు పిడుగుద్దులు గుద్దుకున్న భక్తులు బీభత్సం సృష్టించారు. క్యూ లైన్లలో మాటల యుద్దంతో మొదలై శృతి మించి గొడవలకు తీసింది. తిరుమల తిరుపతి దేవస్శానం భద్రతా సిబ్బంది సర్ధి చెప్పినా వెనక్కు తగ్గకుండా భక్తులు కొట్టుకున్నారు. క్యూ లైన్ లో కొట్టుకోవడం విచారకరం. శ్రీవారి దర్శనం తరువాత రెండు గ్రూపు లను అదుపులోకి తీసుకుని విజిలెన్స్ అదికారులు విచారిస్థున్నారు.
Next Story

