Sun Mar 15 2026 08:54:22 GMT+0530 (India Standard Time)
విజయవాడలో ఉద్రిక్తత
విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో వందలాదిమంది అంగన్వాడీలపోలీసులు అరెస్ట్ చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. అరెస్టు అయినవారిలో అంగన్వాడి యూనియన్, సిఐటియు నేతలు సిహెచ్.నర్సింగరావు, సుబ్బారావమ్మ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు తదితరులున్నారు.
నిండిపోయిన పోలీస్ స్టేషన్లు...
విజయవాడలో అరెస్ట్ అయిన అంగన్ వాడి మహిళలను అన్ని పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లు అంగన్ వాడీ కార్యకర్తలతో నిండిపోయాయి. కొన్ని కళ్యాణ మండపాల్లోను అంగన్ వాడీలను ఉంచారు. అంగన్ వాడీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏలూరు రోడ్డు, పడవల రేవు, బీఆర్ఎస్టీ రోడ్ లో అంగన్ వాడీలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Next Story

