Mon Feb 02 2026 02:39:49 GMT+0000 (Coordinated Universal Time)
Hindupuram : హిందూపురంలో టెన్షన్.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీఛార్జి
హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు.

హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. దీంతో పురుషోత్తమ్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
వైసీపీనేతపై దాడితో...
వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య హిందూపురంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. స్వల్పంగా లాఠీ ఛార్జీ కూడా చేశారు. హిందూపురంలో ఓటర్లు పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Next Story

