Fri Dec 05 2025 16:35:21 GMT+0000 (Coordinated Universal Time)
పీఆర్సీపై స్పష్టత.. జగన్ కు చేరిన నివేదిక
పీఆర్సీపై స్పష్టత వచ్చింది. 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ సిఫార్సు చేసింది.

పీఆర్సీపై స్పష్టత వచ్చింది. 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ సిఫార్సు చేసింది. కొద్దిసేపటి క్రితం సమీర్ శర్మ ముఖ్యమంత్రి జగన్ కు నివేదికను అందిచారు. పీఆర్సీ నివేదికలో తమ కమిటీ మొత్తం 11 సిఫార్సులను ప్రభుత్వానికి సూచించిందని తెలిపారుద. 27 శాతం ఫిట్ మెంట్ఇవ్వాలని తాము ప్రతిపాదించామని సమీర్ శర్మ మీడియా సమావేశంలో తెలిపారు.
30 శాతం ఇచ్చే యోచనలో....
దీనివల్ల ప్రభుత్వానికి పది వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని సమీర్ శర్మ తెలిపారు. జగన్ ఈ నివేదిక పై రానున్న 72 గంటల్లో నిర్ణయం తీసుకుంటారని సమీర్ శర్మ తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
- Tags
- sameer sarma
- prc
Next Story

