Wed Mar 18 2026 22:45:35 GMT+0530 (India Standard Time)
Tirupathi : లయన్ తో గేమ్స్ .. సెల్ఫీ దిగుదామని ప్రాణాలు వదిలేశాడు
సింహంతో గేమ్స్ ఆడుదామనుకుని చివరకు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన జరిగింది. తిరుపతి జూలో ఈ ఘటన జరిగింది

అతి చేస్తే అంతే.. సింహంతో గేమ్స్ ఆడుదామనుకుని చివరకు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన జరిగింది. తిరుపతి జూలో ఈ ఘటన జరిగింది. సింహంతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన ఒక వ్యక్తి దాని చేతిలోనే ప్రాణాలు వదిలాడు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జూలాజికల్ పార్కు లో సింహం ఎన్‌క్లోజర్ లోకి ఒక యువకుడు ప్రవేశించాడు.
ఎన్‌క్లోజర్ లోకి వెళ్లి....
సింహంతో సెల్ఫీ దిగాలని సాహసం చేయడానికి ప్రయత్నించాడు. అయితే సింహం అరిచిన వెంటనే పరుగున వెళ్లి చెట్టు పైకి ఎక్కాడు. అయితే భయంతో చెట్టుపై నుంచి పడటంతో సింహ ఊరుకుంటుందా? జూ సిబ్బంది వచ్చే లోపు అతగాడిపై దాడి చేసి చంపేసింది. దీంతో అతడు మరణించాడు. సింహం దాడి ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story

