Tue Mar 10 2026 05:44:14 GMT+0530 (India Standard Time)
అమర్ నాధ్ యాత్రలో విషాదం.. ఆ ఇద్దరూ మృతి
అమర్ నాధ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్ నాథ్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు మృతి చెందారు

అమర్ నాధ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమర్ నాథ్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. రాజమండ్రికి చెందిన సుధ, మరో మహిళ పార్వతి మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అమర్ నాధ్ యాత్రకు ఏపీ నుంచి 84 మంది యాత్రికులు వెళ్లారు. వారిలో ఇద్దరు తప్ప మిగిలన వారంతా క్షేమంగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీనగర్ మార్చురీలో సుధ మృతదేహం, ఢిల్లీ ఎయిమ్స్ లో సుధ మృతదేహాన్ని ఉంచారు.
మృతదేహాలను....
అమర్ నాధ్ యాత్రలో భాగంగా గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటుంగా ఒక్కసారి వరద వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 17 మంది యాత్రికులు మృతి చెందారు. ఏపీ నుంచి వెళ్లిన ఇద్దరు యాత్రికుల మృతదేహాలను ఏపీకి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన వారిని కూడా సురక్షితంగా ఏపీలోని వారి ప్రాంతాలకు పంపించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story

